May 19,2023 22:40

విశిష్ట సేవలు అందించిన వాలంటీర్లను సత్కరిస్తున్నఅధికారులు, ప్రజాప్రతినిధులు



ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్రంలో ఆదర్శంగా అమలవుతున్న వలంటీర్‌ వ్యవస్థే నిజమైన ప్రతీకని ఎంపి వంగా గీత అన్నారు. శుక్రవారం స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి వాలంటీర్లకు వందనం-2023 కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ సిటీ, రూరల్‌ ఎంఎల్‌ఎలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు అతిధులుగా హాజరై జిల్లాలో విశిష్ట సేవలు అందించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డు అందుకున్న 11,273 మంది వార్డు, గ్రామ వలంటీర్లకు రూ.11 కోట్ల 50 లక్షల 30 వేల అవార్డు చెక్కును అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అతిధులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వలంటీర్ల వందనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వలంటీర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని సభికులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ గడచిన 3 సంవత్సరాలుగా ప్రతి నెల 1వ తేదీన సూర్యోద యానికి మందే తలుపు తట్టి శుభోదయం పలికి పింఛన్లు అంది స్తున్న వలంటీర్లు నిరుపేద అవ్వా, తాతలు అందరి ఆశీర్వాదాలు అందుకుంటున్నారన్నారు. రానున్న 10 రోజుల పాటు మండలాల వారిగా జరిగే వలంటీర్ల వందనం కార్యక్రమం ద్వారా ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సత్కారాలు, అవార్డులు అందజే యనున్నట్టు తెలిపారు. ఎంపి గీత, ఎంఎల్‌ఎలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబులు మాట్లాడారు. అనంతరం కాకినాడ రూరల్‌ వాకల పూడి-3 వాలంటీరు రాయుడు కనకదుర్గ మాట్లాడుతూ సమాజం తమకు అందిస్తున్న గౌరవానికి వాలంటీర్లు అందరి తరపున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి, ప్రజలకు కతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విశిష్ట సేవలు అందించి వలంటీర్లకు వందనం-2023 అవార్డు లకు ఎంపికైన వలంటీర్లకు ఎంపి, జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, ఎడిసి ఆర్‌.నాగ నరసింహారావు, మాజీ మేయర్‌ సుంకర శివ ప్రసన్న, జడ్‌ప్‌ సిఇఒ ఎన్‌.వి.వి. సత్యన్నారాయణ, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వాలంటీర్లకు సత్కారం
గండేపల్లి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం వాలంటీర్లకు సత్కార సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్ని లబ్ధిదారులకు చేరుస్తూ,వారి కళ్లలో ఆనందం నింపుతున్న వాలంటీర్ల సేవలు అద్భుతమని కొనియాడారు. మండలంలో రెండు సేవావజ్ర అవార్డుల రాగా ఒకటి గండేపల్లి గ్రామానికి చెందిన పల్లి వీర వెంకట సౌజన్య, రెండోది తాళ్లూరు గ్రామానికి చెందిన సీలం రామలింగేశ్వరరావులు ఎంపికకాగా... సేవారత్న 5, సేవామిత్ర 234 మొత్తం 241 అవార్డులకు గాను రూ.25 లక్షల నగదు బహుమతి, సర్టిఫికెట్‌, శాలువా, బ్యాడ్జితో వాలంటీర్లను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి చలగల్ల దొరబాబు, జడ్‌పిటిసి పరిమి వెంకటలక్ష్మి మంగతాయారు బాబు, వైస్‌ ఎంపిపి కుంచేరాజా, మండల పార్టీ అధ్యక్షుడు కందుల చిట్టిబాబు, ఒబిన్ని వీరబాబు, జాస్తి వసంత్‌, తాళ్లూరి మధు కుమార్‌, అవసరాల పార్థసారథి, ఎంపిడిఒ రామన్‌, తహశీల్దార్‌ కెవివి సత్యనారాయణ, ఇఒపిఆర్‌డి మూర్తి, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.