Nov 09,2023 21:45

విద్యార్థినులను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌

భామిని : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వ ర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లో జరిగిన అండర్‌ -19 కబడ్డీ పోటీల్లో స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న బిడ్డికి ఆదమ్మ, బిడ్డిక రబిక బంగారు పతకాలు సాధించారు. వీరు బంగారు పతకాలు సాధించేలా తర్ఫీదు ఇచ్చిన పిఇటి గొర్ల శివరాంప్రసాద్‌ను, పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్‌ రఘుపాత్రుని శివకుమార్‌, పాఠశాల సిబ్బంది అభినందించారు.