రాయచోటి టౌన్ : అభివద్ధిలో రాయచోటి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దు తున్నామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కొత్తపేట 20, 21వ వార్డులలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. రెడ్డెన్న వీధి, సాయిరాం వీధి, నెహ్రూ నగర్, టెంకాయచెట్ల వీధి, గాంధీ నగర్, నేషనల్ హైస్కూల్ వీధి, ప్రశాంత్ నగర్, సింగపూర్ లైన్, కాకతీయ కాలేజ్ లైన్, విఆర్ స్కూల్ వీధి, ముస్తఫా వీదులలో గడప గడపను సందర్శించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, పథకాలు అందని వారితో ఆప్యాయత, ప్రేమానురాగాలుతో ప్రజలను పలకరిస్తూ, సమస్యల పరిష్కారంపై బిడ్డలా, సోదరునిలా చొరవచూపుతూ ప్రతి గడపను శ్రీకాంత్‌రెడ్డి సందర్శించారు. కొత్తపేట అభివద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుధ్యం మరింత మెరుగునకు కషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాష, సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, నాయకులు జయరామిరెడ్డి, మహేష్‌రెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, కౌన్సిలర్లు కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, కొలిమి ఛాన్‌బాష, సుగవాసి శ్యామ్, జానం రవీంద్ర యాదవ్, షబ్బీర్, పల్లా రమేష్, మురికినాటి వెంకట్రామిరెడ్డి, అమరనాధరెడ్డి, అనీల్ రెడ్డి, గంగిరెడ్డి, విల్వపతిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా సంఘ సభ్యుడు దిన్నెపాడు రవిరాజు, మానవత యర్రపురెడ్డి బ్రహ్మానందరెడ్డి, లక్ష్మీకర్ రెడ్డి, షిరిడీ సాయి మహిళా కళాశాల డైరెక్టర్ మనోజ్ రెడ్డి, శంకర్‌రెడ్డి, కో-ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ, పాల్గొన్నారు.
సమస్యలు తెలుసుకుంటున్న శ్రీకాంత్‌రెడ్డి










