ఆదర్శ నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్: సిపిఎం
ప్రజాశక్తి ఆత్మకు రు
తొలితరం దళిత నేత సమత వాది సంఘసంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, ప్రజానాట్యమండలి నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీనియర్ పాత్రికేయులు కేజే చంద్రశేఖర్ ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు డి.వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం పార్టీ పట్టణ నాయకులు డి. రామ్ నాయక్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ పుట్టింది పెరిగింది బీహార్ లోనే చదువుకున్నది కూడా బీహార్ లోనే అన్నారు.. ఆయన చిన్ననాటి నుంచే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం ఆయన చేశా పోరాటం మరువలేనిది అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా భారత దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవ చేసేందుకు అంకితమైన ఆయన జీవితం నేటి సామాజిక ఉద్యమాలకు ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు ఎన్,స్వాములు, ఏ.సురేంద్ర,షేక్ ఇస్మాయిల్, మండల నాయకులు మా భాష, నాయకులు గణపతి, మల్లయ్య రవి చెన్నయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు.










