Aug 27,2023 00:06

ప్రజాశక్తి - పామూరు
కనిగిరి మండలం గొల్లపల్లి వద్ద ఈనెల 21న తండ్రి చేతిలో హత్యకు గురైన 13ఏళ్ల చిన్నారి మంజుల కుటుంబ సభ్యులను ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి పరామర్శించారు. హత్యకు కారణమైన తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని అన్నారు. మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న ఘటనలకు కారణమవుతున్న మద్యం నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కనిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్ధినులనుద్దేశించి ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, జిల్లా అధ్యక్షురాలు ఎస్‌డి షమ్మి, కనిగిరి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కె బషీరా, కె లక్ష్మీ ప్రసన్న, ఐద్వా నాయకులు రమణమ్మ, శాంతకుమారి, అత్తమ్మ, జెవివి నాయకులు జి శ్రీనివాసరెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు  పాల్గొన్నారు.