Jul 08,2023 19:34

దొంగతనం జరిగిన తీరును వెల్లడిస్తున్న బాధితుడు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో వరుస చోరీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వైఎంకె స్కూల్‌ వద్ద ఉన్న కొత్త బ్రిడ్జి పక్కన ఆర్‌టిఒ కార్యాలయం సమీపంలోని ఐరన్‌ వెల్డింగ్‌ వర్క్‌ షాపులో గత రాత్రి ఇనుము షెడ్లను కట్‌ చేసి దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. లోపలికి దూరిన దొంగలు రెండు చేతి గ్రైండర్‌ మిషన్లు, బ్లేడ్లు, ఇరాన్‌ షీట్లు, ఐరన్‌ వస్తువులు దొంగలించారని బాధితులు మహబూబ్‌ శనివారం వాపోయారు. దీని విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని తెలిపారు. అక్కడి వ్యాపారులు మాట్లాడుతూ... రాత్రి సమయాల్లో పోలీసు గస్తీ పెంచాలని కోరారు. శిరుగుప్ప టర్నింగ్‌ నుంచి నూతనంగా ఉన్న వైఎంకె స్కూల్‌ బ్రిడ్జి వరకు సుమారు ఎక్కువ శాతం ఐరన్‌ దుకాణాలు ఉన్నాయన్నారు. ఈ దుకాణాల్లో నిత్యం చోరీలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ఉన్న దుకాణదారులంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని చెప్పారు. పోలీసులు వెంటనే దొంగలను పట్టుకుని బాధితునికి న్యాయం చేయాలని తోటి వ్యాపారులు కోరారు.