ప్రజాశక్తి - ఆదోని
ఈనెల 23న పట్టణంలో జిల్లా బాడీ బిల్డర్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఛైర్మన్ కునిగిరి నీలకంఠ తెలిపారు. సోమవారం పట్టణంలోని భీమాస్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో మిస్టర్ కర్నూలు బెంచ్ ప్రెస్ కాంపిటీషన్ ఉదయం 9 నుంచి, ఉమ్మడి కర్నూలు జిల్లా బాడీ బిల్డర్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. కర్నూలు జిల్లానే కాకుండా నంద్యాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఉత్సాహవంతులైన యువకులు పాల్గొంటారన్నారు. గత 37 ఏళ్లుగా శ్రీహనుమాన్ వ్యాయామశాల జాపాల్లి బాడీ లైన్‌లో అనేక మంది యువకులు ట్రైనింగ్ తీసుకున్నారని తెలిపారు. సెక్రటరీ హనుమంతు, జాయింట్ సెక్రటరీ సాకారే శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్ మంజునాథ్, ట్రెజరర్ కామలే గోవిందు, జాయింట్ సెక్రటరీ రవీంద్ర, ఆర్గనైజర్ బి.లోకేష్ పాల్గొన్నారు.
కరపత్రాలను విడుదల చేస్తున్న కునిగిరి నీలకంఠ










