విద్యార్థులతో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని నౌలేకల్ గ్రామంలో ఎంపియుపి పాఠశాలలో అదనపు గదుల్లేక విద్యార్థులు వరండాలోనే కూర్చొన్నారు. ఉపాధ్యాయులు అక్కడే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఏమిటని ప్రశ్నిస్తే అదనపు గదుల్లేక ఇబ్బంది ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పారు. అదనపు గదుల్లేక రెండు తరగతులను ఒకే గదిలో బోధిస్తున్నట్లు తెలిపారు. గురువారం సిపిఎం జిల్లా నాయకులు వెంకటేశులు, మండల కార్యదర్శి తిక్కన్న, పాండవగల్ వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రాజేంద్రప్రసాద్‌లు ప్రధానోపాధ్యాయులతో సమస్యను అడిగి తెలుసుకున్నారు. తమ విద్యార్థులకు తగ్గట్టు గదుల్లేవని చెప్పారు. దీనిని వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు.










