Jun 04,2023 23:36

ప్రచారం చేపడుతున్న గిరిజన సంఘం నేతలు

ప్రజాశక్తి-అరకులోయ :ఏపీ గిరిజన సంఘం 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 6,7,8, తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఆదివాసి సంస్కృతి సంబరాలను విజయవంతం చేయాలని సుంకరమెట్ట వారపు సంతలో ఆదివారం ఈ సంఘం నేతలు విస్తతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న. అధ్యక్షులు జి. బుజ్జిబాబు, ఉపాధ్యక్షులు కె.బుజ్జిబాబు మాట్లాడుతూ, ఆదివాసీ సాంస్కతిక. పరిరక్షణ, హక్కులకై పోరాటం చేయాలన్నారు. ఆదివాసి సంప్రదాయలు, కళలు కనుమరుగై పోతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో భవిష్యత్తు లో ఆదివాసీ యువతకు సాంస్కతి, సంప్రదాయలు, వారసత్వం అందాల్సి వుందన్నారు.వేలాదిమంది గిరిజన మేధావులు, యువత గిరిజన ప్రజానీకం అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి పి.నానిబాబు, నాయకులు టి.జోషి తదితరులు పాల్గొన్నారు.