ప్రజాశక్తి-యంత్రాంగం
పాడేరు : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నేత పి అప్పల నర్శ విమర్శించారు.ప్రపంచ ఆదివాసి హక్కుల దినం పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు ఎస్ ధర్మన్నపడాల్ ఆవిష్కరించారు. అనంతరం పి.ఎం.ఆర్‌సి సమావేశ మందిరంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనరస మాట్లాడుతూ, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కోసమే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల హక్కులపై పాలకవర్గాలు దాడిని చేస్తున్నాయని అదే పద్ధతిని భారతదేశ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. మరో పక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరు పాలక వర్గాలు సభలు,సమావేశాల పేరిట హడావుడి చేయడం చేయడం తప్ప ఆదివాసీల పట్ల చిత్తశుద్ది లేదని, ఆదివాసీ దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు లేదని అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్కు మాట్లాడుతూ, పివిటిజీలకు సీసీడీపీ నిధులు, ట్రైకార్ వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ వాణిజ్య పంటల యంత్రాల పరికరాలు, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.సుందర్‌రావు, మండల కార్యదర్శి సత్యనారాయణ, జీనబంధు ఆదివాసీ మాతృ భాష విద్యా వాలంటరీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పాంగి కుమారీ, జిల్లా కార్యదర్శి కొర్ర సర్బూ నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చిన్నారావు, మాణిక్యం, వంతల దాసు చిన్నారి, చంద్రయ్య, కొండయ్య, సాంబపాల్గొన్నారు
అనంతగిరి:ప్రపంచ ఆదివాసుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ మూడు రోడ్ల జంక్షన్ మీదుగా కొనసాగింది.స్థానిక హరిత హిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో జెడ్పిటిసి దీసరి. గంగరాజు ఎంపీపీ శెట్టి. నీలవేణి పాల్గొన్నారు ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, ఆదివాసి చట్టాలు, హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్. కొండలరావు, జె.సుబ్బారావు, టోకురు సిపిఎం సర్పంచ్ కిల్లో. మొస్య, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.దేవుడు, జిల్లా సహా అధ్యక్షులు శెట్టి. రాంబాబు, ఆదివాసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గురుదొర, డి.సన్యాసిరావు, కె.రామసుందర్, ఎస్.రాంబాబు, వి.భాస్కరరావు, మల్లేశ్వరరావు, రామకృష్ణ, మహిళా సంఘం ప్రతినిధులు కాసులమ్మ, .దేవుడమ్మ పాల్గొన్నారు
డుంబ్రిగుడ: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని స్థానిక మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మండల కేంద్రంలో జంక్షన్ వరకు భారీ ర్యాలీ, మానవహరం చేపట్టారు.గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌బి పోతురాజు, టి సూర్యనారాయణ మాట్లాడుతూ, అనేక గిరిజన గ్రామాల్లో రోడ్లు, వంతెనలు ,తాగునీరు, విద్యా వైద్య వంటి సౌకర్యాలు అందగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షుడు బాలకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్: మండలంలోని చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంఘం మండల నాయకులు రామారావు, ఎస్.మల్లేష్, బి.కోగేష్ పాల్గొన్నారు.
జి.మాడుగుల: మండల కేంద్రంలో ఆదివాసి దినోత్సవాన్ని ఎం.పి.పి కొర్రా పద్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టిబాబు, మండల ప్రధానకార్యదర్శి కిముడు కళ్యాణం, ఎస్. నాగబ్బాయి, ఎస్టి సెల్ కార్యదర్శి సింహాచలం పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎంఎం శ్రీను, కార్యదర్శి కొర్ర నర్సయ్య ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి కొర్ర నర్సయ్య గిరిజన సంఘం పతకాన్ని ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో శారదా నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చెండా మత్స్యరాజు, ఐద్వా మండల కార్యదర్శి విజయ పాల్గొన్నారు.
హుకుంపేట:స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ఉప అధ్యక్షులు టీ.కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.వి.అ.ర్.ఏ యూనియన్ నాయకులు ఎం.మోహన్‌రావు గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళ సంఘం కార్యదర్శ హైమవతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు పి.సోమన్న, రామారావు పాల్గొన్నారు.
పెదబయలు :వివిధ పాఠశాలల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక సిఎహెచ్ పాఠశాలలో విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విఆర్.పురం:గిరిజన హక్కులు, చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పులి సంతోష్‌కుమార్ హెచ్చరించారు. మండల కేంద్రం రేఖపల్లి జంక్షన్‌లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేఖపల్లి సర్పంచ్ పూనెం సరోజిని గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంతోష్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల నాశనానికి కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు. సిఐటియు జిల్లా నాయకులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ మణిపూర్‌లో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి గిరిజనులు, గిరిజన మహిళలపై దాడి చేశారని, దీనిపై గిరిజన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
నాగపూర్ రైల్వే స్టేషన్లో...
కూనవరం : ఢిల్లీలో ధర్నా అనంతరం తిరుగు ప్రయాణంలో మహారాష్ట్ర నాగపూర్ రైల్వే స్టేషన్లో కూనవరం, ఎటపాక, మండలాల గిరిజన సంఘం నాయకులు, కార్యకర్తలు ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కూనవరం వైస్ ఎంపీపీ కొమరం, గిరిజన సంఘం నాయకులు కాక అర్జున్, బి.కిరణ్, ఇర్పా అజరు, బాబు బొర్రయ్య, పాయం సీతారామయ్య, సోడే శంకర్, రాజు, సమ్మక్క, కుంజ రాధ, సోయం వీరమ్మ, కన్నారావు పాల్గొన్నారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో...
రాజవొమ్మంగి : పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కరించాలని ఢిల్లీలో ధర్నాకు వెళ్లిన ఆదివాసీలు, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెల్లం రామకృష్ణ ఆధ్వర్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, గిరిజన సంఘం ఎపి రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ ఆదివాసీలను అడవి నుండి గెంటివేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, అందుకోసమే నూతన అటవీ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.నాగేశ్వరరావు, సిరిమలి రెడ్డి, ఎ.రవి, ఎమ్ వాణిశ్రీ, కె.సూరిబాబు, కె జగన్నాథం, రమేష్, రాజు, టి శ్రీను, నాగమణి పాల్గొన్నారు.










