సమావేశంలో మాట్లాడుతున్న టిఆర్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లోవరాజు
ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రోబ్బ లోవరాజు కోరారు. ఆగస్టు 9న మన్యం జిల్లాలోని ఆదివాసి గిరిజన సంఘాలనాయకులు, ప్రజా సంఘాలు, గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు స్థానిక హెచ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే ఆదివాసి దినోత్సవానికి హాజరుకావాలని కోరారు. ప్రతి ఆదివాసీ పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు ఇంటికుప్పల రామకృష్ణ, కోలక అవినాష్, సత్యనారాయణ, యడ్ల సూర్యనారాయణ, నిమ్మక సింహాచలం, తిరుపతిరావు, మండంగ రమణ తదితరులు ఉన్నారు.










