ప్రజాశక్తి-సీతంపేట : ఐటిడిఎ ఆధ్వర్యంలో ఆదివాసీ, స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. బుధవారం ఐటిడిఎలోని అన్ని శాఖల అధికారులతో ఆదివాసీ, స్వాతంత్ర దినోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పిఒ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా వేడుకలు నిర్వహించాలన్నారు. అడవితల్లి విగ్రహం వద్ద పూజలతో వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. వేడుకకు హాజరయ్యే గిరిజనులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన సంఘాల నాయకులందరినీ ఆహ్వానించాలని అన్నారు. సెల్ఫీ పాయింట్, జిసిసి స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవానికి కూడా ఇదే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎపిఒ రోసిరెడ్డి, ఇఇ సింహాచలం, జిసిసి డిఎం సంధ్యారాణి, డిడి శ్రీనివాసరావు, పిహెచ్‌ఒ గణేష్, తహశీల్దార్ నర్సింహమూర్తి, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ ఢిల్లీశ్వరరావు, ఎస్‌ఐ నీలకంఠరావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ చిరంజీవి, ఎటిడబ్ల్యుఒ మంగవేణి, ఎఎంఒ కోటిబాబు, జిసిడిఒ రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.










