ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.45 లక్షలు వచ్చింది. ఆలయంలోని అనివెట్టి మండపంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత నెల 8 నుంచి ఈనెల 24వ తేదీ వరకు 47 రోజుల్లో ఈ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్ తెలిపారు. నోట్ల రూపేణా 43,11,976, చిల్లర నాణేల రూపేణా రూ.1,79,017 మొత్తం రూ.44,90,993 ఆదాయం సమకూరింది. 36 గ్రాముల బంగారం, 2 కేజీల 140 గ్రాముల వెండి, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా 26 అమెరికా డాలర్లు సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సూపరింటెండెంట్ బి.వి.వి.ఆర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు, శ్రీకూర్మం ఆలయ ఇఒ జి.గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.










