Jun 23,2023 22:56

ప్రజాశక్తి-గండేపల్లి సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల, వైజాగ్‌ బే సెక్షన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్‌ గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ ఛాలెంజెస్‌ అంశంపై శుక్రవారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమయియంది. ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా డాక్టర్‌ కె.శివకుమార్‌ పాల్గొనగా, టిసిఎస్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఎంజిపిఎల్‌.నారాయణ మరో ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సులో ప్రధాన ప్రసంగం చేశారు. ఇలాంటి కాన్ఫరెన్స్‌ ఇంజనీరింగ్‌ సవాళ్లపై జ్ఞానాన్ని పొందడంలో సహాయపడుతుందని, సాంకేతికతలు మెరుగు పడుతుండడంతో పరిశోధనల తీరు కూడా రోజురోజుకు మారుతోందని చెప్పారు. యువత పరిశోధనల ద్వారా సుస్థిరత అభివద్ధిని అర్థం చేసుకోవాన్నారు. నానో, రోబో, టెక్నో, మొబైల్‌ అప్లికేషన్‌ మొదలైన వివిధ రకాల సాంకేతికతలను సాధించాలన్నారు. సమాజంలో సాంకేతికత ఆధారంగా విద్యను పెంచాలని చెప్పారు. ఈ రోజుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి 45 మంది పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్స్‌ డాక్టర్‌ ఎం .శ్రీనివాస్‌ రెడ్డి, డాక్టర్‌ డోలా సంజరు, డాక్టర్‌ ఆదిరెడ్డి రమేష్‌, డీన్‌లు డాక్టర్‌ ఎస్‌.రమాశ్రీ, డాక్టర్‌ కెవిఎస్‌ఆర్‌.మూర్తి వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.