Nov 13,2023 22:29

ప్రజాశక్తి-గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య విద్య ప్రాంగణంలో సౌత్‌ జోన్‌ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ (పురుషులు) టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసినట్టు ఆదిత్య విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నల్లమిల్లి సతీష్‌ రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో నాగులో రోజు మైసూర్‌ యూనివర్సిటీ వర్సెస్‌ మంగుళూరు యూనివర్సిటీ మధ్య జరగగా మంగుళూరు 64-53 స్కోర్‌తో గెలుపొందింది. యోగి వేమన యూనివర్సిటీ వర్సెస్‌ వేల్స్‌ యూనివర్సిటీ మధ్య జరిగిన మ్యాచ్‌ లోవేల్స్‌ 37-29 స్కోర్‌తో గెలుపొందింది. యోగి వేమన యూనివర్సిటీ వర్సెస్‌ మంగుళూరు జరిగిన మ్యాచ్‌లో మంగుళూరు జట్టు 36-27 స్కోర్‌తో గెలుపొందింది. మైసూర్‌ వర్సెస్‌ వేల్స్‌ యూనివర్సిటీ మధ్య జరిగిన మ్యాచ్‌లో వేల్స్‌ జట్టు 53-26 స్కోర్‌తో గెలుపొందింది. యోగివేమన వర్సెస్‌ మైసూర్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో 44-46 స్కోర్‌తో మైసూర్‌ జట్టు విజయం సాధించింది. మంగుళూరు వర్సెస్‌ వేల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వేల్స్‌ జట్టు 51-46 స్కోర్‌తో గెలుపొందింది. నాలుగు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోటీలో అత్యధిక పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచిన వేల్స్‌ జట్టు విజేతగా నిలిచింది. మంగుళూరు జట్టు ద్వితీయస్థానంలోనూ, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌ జట్టు తతీయ స్థానంలో యోగి వేమన యూనివర్సిటీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. విజేత జట్టుకు ట్రోఫీ మెడల్స్‌, ప్రశంసాపత్రాలు మాజీ ఎంఎల్‌ఎ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి, జెఎన్‌టియుకే విసి ప్రొఫెసర్‌ జివిఆర్‌ ప్రసాద్‌ రాజు, ఆదిత్య విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నల్లమిల్లి సతీష్‌ రెడ్డి, జింబాబ్వేకు చెందిన ఎడ్యుకేషనల్‌ కౌన్సిలర్స్‌ లవ్‌ మోర్‌ పాల్గొని ట్రోపీ మెడల్స్‌ ప్రశంసా పత్రాలను అందించారు. దక్షిణాది ఆరు రాష్ట్రాలకు చెందిన 113 యూనివర్సిటీలకు చెందిన 103 టీములు, సుమారు 1200 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతలతో పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస రెడ్డి, టోర్నమెంట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ జిపి.రాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్యామ్‌ కుమార్‌ తెలిపారు.