ప్రజాశక్తి-గండేపల్లి ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో 22, 23 తేదీల్లో రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్.సతీష్ రెడ్డి అధ్యక్షత వహించగా శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ డాక్టర్ కెఐ.వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు డాక్టర్ జి.సతీష్ రెడ్డి, మాజీ డిజిపి కెకె.ఖాన్ గౌరవ అతిథులుగా, మాజీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర శిష్ట్లా రామకృష్ణ, ఎపి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.విలియం కారె ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఆదిత్య అధినేత డాక్టర్ ఎన్.శేషారెడ్డి, ఫార్మసి ప్రిన్సిపల్ డాక్టర్ కె.రవిశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఫార్మసీ రంగంలో నూతన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్య అతిథి డాక్టర్ కెఐ.వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ సమాజ అభివద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ఆ మార్పు సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి నల్లమిల్లి లకీëరాజ్యం, డైరెక్టర్ శృతి రెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి, ఆదిత్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.సతీష్‌కుమార్ పాల్గొన్నారు










