Jun 25,2023 23:35

ప్రజాశక్తి-గండేపల్లి సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల ఐఇఇఇ వైజాగ్‌ బే సెక్షన్‌తో సంయుక్తంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్‌ గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ ఛాలెంజెస్‌పై అంతర్జాతీయ సదస్సు ఫలప్రదంగా విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రా ఎలక్ట్రికల్స్‌ సిఇఒ కె.శ్రీధర్‌, పాల్గొని సదస్సులో ప్రధాన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇలాంటి కాన్ఫరెన్స్‌ అవశ్యకత ఎంతైనా అవసరం ఉందన్నారు. నేటి ఇంజనీరింగ్‌ సవాళ్లపై జ్ఞానాన్ని పొందడంలో సహాయపడుతుంది. యువత పరిశోధనల ద్వారా సుస్థిరత అభివద్ధిని అర్థం చేసుకోవాలి. సుస్థిర అభివద్ధి అనేది ఔషధం, నానో, రోబో, టెక్నో, మొబైల్‌ అప్లికేషన్‌ మొదలైన వివిధ రకాల సాంకేతికతలు సాధించాలి. సమాజంలో సాంకేతికత ఆధారంగా విద్యను పెంచాలి అని చెప్పారు. భావి ఇంజనీర్లు కొలువుల కొరకు ఎదురు చూడకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్‌, ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఆదిత్యలో ఈ రకమైన మొదటి ఐఇఇఇకాన్ఫ్‌ అన్నారు. ఎన్‌ఐటి ఎపిఎన్‌ఐటి. ఢిల్లీ నుండి పేపర్‌ రచయితలు వచ్చారు. ఎన్‌ఐటి జంషెడ్‌పూర్‌ (2), జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం, ఎస్‌ అర్‌ ఎం, విఐటి, చండీగఢ్‌ విశ్వవిద్యాలయం, ఎన్‌బికెఆర్‌, విద్యానగర్‌, గీతం, ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం, వరంగల్‌, న్యూ హారిజన్‌ బంగోర్‌, నియోటియా విశ్వవిద్యాలయం నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ రోబోట్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఇమేజ్‌ ఫ్యూజన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, 5జి కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో పేపర్లు సమర్పించారు. 34 మంది పరిశోధకులు పత్రాలను సమర్పించారు. డీన్‌ డాక్టర్‌ కెవిఎస్‌ఆర్‌.మూర్తి ఆర్గనైజింగ్‌లో రెండురోజుల సదస్సు విజ్ఞానదాయకంగా ముగిసింది. సదస్సులో పాల్గొన్న పరిశోధన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రొఫెసర్స్‌ ఆదిత్య ఆతిథ్యం మరువలేనిదని నిర్వహణ బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ డోలా సంజరు ఎస్‌. డాక్టర్‌ ఆదిరెడ్డి రమేష్‌, డీన్‌ లు డాక్టర్‌ ఎస్‌.రమాశ్రీ, డాక్టర్‌ కె.వి.ఎస్‌.ఆర్‌.మూర్తి, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.