మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి
ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంపై
ఎంఎల్‌ఎ మేకపాటి అభినందనలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎస్‌ఎల్‌విసి 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-01 మిషన్ విజయవంతం కావడం పట్ల ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు, మిషన్ విజయవంతానికి కషి చేసిన వారందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు..అంతరిక్ష ప్రయోగాల్లో మన భారతదేశం దూసుకపోతుందని, ఆదిత్య ఎల్ -1 విజయంతో అంతరిక్ష రంగంలో భారత మరో మైలురాయిని అందుకుందని ప్రదర్శించారు. ఇటీవల చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ చేసి అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మన శాస్త్రవేత్తలు నేడు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని విజయవంతం చేయడాన్ని ప్రపంచ దేశాలన్ని హర్షిస్తున్నాయని అన్నారు.ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు ముఖ్యపాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు.










