Nov 29,2021 08:11

కుండీల్లో చక్కగా కొలువుదీరి, నిండుగా పువ్వులిచ్చే మొక్క అడినియం. దీనిలో రకరకాల రంగుల మొక్కలు ఉన్నాయి. నేల మీద నాటుకునేవి, కుండీల్లో పెంచుకునేవి, ఇండోర్‌, ఔట్‌ డోర్‌, సెమీషేడ్‌, బోన్సాయ్, వెరిగేటా, డ్వార్ఫ్‌ రకాల మొక్కలు ఇందులో లభిస్తాయి. అడినియం అనేది 'అపోనేసీ జాతి'లో పుష్పించే మొక్క. ఇది ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పానికి చెందినది.

     అడినియం మొక్క ఆకులు కొద్దిగా విషప్రభావాన్ని కలిగి ఉంటాయి. విత్తనాల ద్వారా, అంటు కట్టడం ద్వారా ఈ మొక్కలు ఉత్పత్తవుతాయి. వీటి మొదలు, కాండం విభిన్న ఆకృతుల్లో కొలువుదీరి కళాత్మకంగా ఉంటాయి. అన్నిరకాల నేలల్లోనూ, కొబ్బరి పొట్టు మిశ్రమంలోనూ ఇవి బాగా పెరుగుతాయి. రోజూ కొద్దికొద్దిగా నీరు పోస్తే చాలు. ఒకవేళ 15 రోజులు నీళ్లు పోయకపోయినా తట్టుకోగలదు. దీన్ని 'ఎడారి గులాబీ' అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో మూడు నెలలు తప్ప, మిగతా సంవత్సరమంతా పువ్వులు పూస్తాయి. ఒకసారి వికసించిన పువ్వులు ఏడురోజులు వరకూ పాడవ్వకుండా నిగారింపుగా ఉంటాయి. వీటి పూలకి ఎటువంటి వాసనా ఉండదు.

                                                                            చిలుకూరి శ్రీనివాసరావు
                                                                                 89859 45506



                                                                   మల్టీ కలర్‌ ఇండోర్‌..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

అడినియం మొక్కల్లో మల్టీ కలర్‌ అరుదైన మొక్క. వీటి పువ్వులు ఐదురేకలతో విచ్చుకుంటాయి. పసుపు రంగు రేకలు మధ్యలో ఎర్రని చారలు రంగు చిలక రించినట్లు అందంగా ఉంటాయి. మొక్కలు కాస్త పొట్టిగానే ఉంటాయి. ఇవి ఇండోర్‌ మొక్కలు అయినప్పటికీ గాలి, వెలుతురు కావాలి. వారానికి కొన్ని గంటలైనా ఎండలో ఉంచాలి. ఈ మొక్కని ఎక్కడ అలంకరించినా అందంగా ఉంటుంది.

                                                                               వైట్‌..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

పాలమీగడ లాంటి శ్వేతవర్ణ కాంతులు విరజిమ్మేది వైట్‌ అడినియం. ఆకుపచ్చని ఆకుల మధ్య తెల్లని పువ్వులు విచ్చుకుని, చాలా అందంగా ఉంటాయి. మొక్క నెమ్మదిగా మూడడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇవి సెమీషేడ్‌ మొక్కలు.

                                                                            స్కై బ్లూ..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

పువ్వులు స్కై బ్లూ రంగులో నాజూగ్గా ఉండే పువ్వులు మొక్క అడినియం స్కై బ్లూ. పువ్వులు రెండుమూడు రోజులకి వాడిపోతాయి. కొత్తవి మొగ్గ తొడుగుతాయి.

                                                                       ఒబేసమ్‌..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

గమ్మత్తైన పూల మొక్క అడినియం ఒబేసమ్‌. దీన్నే 'డెసర్ట్‌ ప్లాంట్‌' అని కూడా పిలుస్తారు. మొదలు పెద్దగాను, మొక్క తలభాగం చిన్నగాను ఉంటుంది. ఇది బోన్సారు జాతికి చెందినదే. ఈ మొక్కకు ఆకులు అస్సలు కనిపించవు. వర్షాకాలంలో మొక్క కొమ్మలకు ఆకులు, పువ్వులు వాడిపోయి, మోడువారి పోయినట్టుంటుంది. మళ్లీ సీజన్‌ ముగిసిపోగానే కొమ్మల నుంచి మొగ్గలు తొడిగి, పువ్వులుగా విచ్చుకుంటాయి.

                                                                  ఫ్లవర్‌ బోన్సాయ్..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

ఈ అడినియం మొక్క బోన్సారు జాతికి చెందింది. ఏళ్ల తరబడి పెరుగుతూ ఉంటుంది. మొక్క నిండా పువ్వులే తప్ప, ఎక్కడా ఆకులు కనిపించవు. ఈ మొక్క సంవత్సరం పొడవునా పువ్వులు పూస్తుంది. దీని ధర పదివేలు పైనే ఉంటుంది. చైనా, హాంకాంగ్‌లో వీటిని ఎక్కువగా తయారుచేస్తారు.

                                                                    రూటెడ్‌ బోన్సాయ్..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

రూటెడ్‌ బోన్సాయ్ అడినియం మొక్క చాలా అందంగా ఉంటుంది. పువ్వులు లేతపింకు రంగులో ఉంటాయి. కాండం, మానులు, తిరిగి ఊడలు వరిగి ఉంటుంది. ఈ మొక్కకి పెద్దగా నీటి వనరు అవసరం లేదు. దీనిని ఇంటా, బయట అలంకరించుకోవచ్చు. రాతి, ఇసుక నేలల్లోనూ ఇవి పెరుగుతాయి.

                                                                             బ్లూ..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

అడినియం జాతిలో అరుదైన పూల మొక్క అడినియం బ్లూ. మొక్క, పువ్వులు చాలా అందంగా ఉంటాయి. దీన్ని సెమీషేడ్‌లో పెంచుకోవడం ఉత్తమం. నీటివనరు పెద్దగా అవసరం లేదు.

                                                                             గ్రాఫ్టెడ్‌..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

ఒకే అడినియం మొక్క రెండురకాలు పువ్వులు పూస్తుంది. ఒకవైపు తెల్లని పువ్వులు, మరోవైపు పింకురంగు పువ్వులు. ఇది అంటు కట్టడం ద్వారా తయారైన మొక్క.


                                                                          ఎల్లో కలర్‌..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

అందమైన ఫ్యాన్సీ పూల మొక్కల్లో ఎల్లో కలర్‌ అడినియం ఒకటి. మొక్క రెండడుగులు వరకూ సెమీషేడ్‌లో బాగా పెరుగుతుంది. కొబ్బరి పొట్టు, బొగ్గులు మిశ్రమంలో మొక్క నిగారింపుగా పెరిగి, పువ్వులు పూస్తుంది. దీనికి కొద్దికొద్దిగా నీళ్లు పోయాలి. ఇంటి లోపల ఏభాగంలో అలంకరించినా మొక్క పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. ఇండియాలోనే కాదు మలేషియా, చైనా, థాయిలాండ్‌, హాంకాంగ్‌ దేశాల్లోనూ ఈ మొక్కలు ఎక్కువగా లభ్యమవుతాయి.

                                                                           గులాబీ..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

సాధారణంగా అడినియం పువ్వు ఐదు రేకలుగా ఉంటుంది. కానీ గులాబీ అడినియం పువ్వు మాత్రం చాలా రేకులతో గులాబీ పువ్వులా ఉంటుంది. ఈ పువ్వును కోయకుండా మొక్క నుంచితే 15 రోజుల వరకూ తాజాగా ఉంటుంది. ఇందులోనూ వివిధ రంగుల పువ్వులు పూసే మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు ఔట్‌డోర్‌, సెమీషేడ్‌లోనూ పెంచుకోవచ్చు.

                                                                               ఫైర్‌..

అదిరే పువ్వులకి.. 'అడినియం' మొక్కలు

ఈ అడినియం పూల మొక్కలు పువ్వులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. పువ్వుకి రేకులు విడివిడిగా కాకుండా ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. పువ్వుల రంగు ఫాబ్రిక్‌ పెయింట్‌ వేసినట్లు రమణీయంగా ఉంటుంది. వీటి పువ్వులను చూడగానే మంట మండుతున్నట్లు ఉంటుంది. అందువల్లే వీటిని 'ఫైర్‌' అడినియం అంటారు.