Nov 10,2023 21:27

ఇసుక డంప్‌ను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

             ప్రజాశక్తి-గుంతకల్లు     ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్న పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఇసుకను అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఉన్న ఇసుక రీచ్‌ను సిపిఎం నాయకులు పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో జగనన్న ఇల్లు కట్టుకునే వారికి కూపన్‌ ద్వారా ఇసుక పంపిణీ చేయడం లేదన్నారు. హౌసింగ్‌ అధికారులు ఇచ్చిన కూపన్లు చూపించినప్పటికీ ఇసుక పంపిణీ చేయడం లేదన్నారు. ఇక బయట ఇల్లు కట్టుకునే వారు ఇసుక కోసం దరఖాస్తు చేసుకుంటే ఇచ్చే పరిస్థితి కనపడడం లేదన్నారు. అదేమని అడిగితే టెండర్‌ పూర్తయిందని కొత్త టెండర్‌ తీసుకున్నవారు వేస్తారని కాలం గడుపుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, కసాపురం రమేష్‌, పట్టణ కమిటీ సభ్యులు తిమ్మప్ప, రామునాయక్‌, చరణ్‌, వెంకీ, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.