ఆటోలను తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ శివకుమార్
ప్రజాశక్తి-సంతమాగులూరు: పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో తీసుకువెళ్లే, ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ ఎన్‌వి శివకుమార్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని అడ్డరోడ్ జంక్షన్‌లో పలు ఆటోలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్న ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటీవల హైవే రహదారులపై జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా, పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని ఆయన ఆటో డ్రైవర్లకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.










