షాపులకు తాళాలు వేస్తున్న రెవెన్యూ సిబ్బంది
పార్వతీపురం టౌన్: స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న మున్సిపల్ ఐడిఎస్‌ఎంటి వాణిజ్య సముదాయంలో ఉన్న పలు షాపులకు సంబంధించిన యజమానులు అద్దెలు చెల్లించకుండా మున్సిపల్ రెవెన్యూ విభాగానికి అద్దె బకాయిలు ఉండడంతో సోమవారం మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగం అధికారి దిబ్బా రూబెన్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి.నారాయణరావు సిబ్బందితో కలిసి అద్దె బకాయిలపడ్డ పలు షాపులకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి రూబేన్ మాట్లాడుతూ, షాపులకు అద్దె బకాయిలు పడ్డ యజమానులు రెండు మూడు రోజుల్లో అద్దెలు చెల్లించాలని, లేనిచో సంబంధిత యజమానులపై మున్సిపల్ నిబంధన రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










