
ప్రజాశక్తి - భట్టిప్రోలు: స్థానిక అద్దేపల్లి ఇస్లాంపేటలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున బుధవారం పర్యటించారు. ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలనే నినాదంతో ఇంటింటికి తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించారు. సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే చంద్రబాబును నేడు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని అన్నారు. పేదవానికి దనీకునికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో పేద, బడుగు, బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డివి లలిత కుమారి, జెడ్పిటిసి తిరివిదుల ఉదయ భాస్కరి, సర్పంచ్ ద్వారా రవికిరణ్మయి, కో ఆప్షన్ సభ్యులు సలీం, మండల ఉపాధ్యక్షులు కె పిచ్చయ్యశాస్త్రి, నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు, చెన్నయ్య, ఇస్మాయిల్, వైసిపి కన్వీనర్ మూర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.