ప్రజాశక్తి-నందిగామ: 14 నెలల నుండి అద్దె చెల్లించలేదని నందిగామ మైనింగ్ కార్యాలయానికి మంగళవారం ఇంటి యజమాని తాళం వేశారు. నందిగామలో గల గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయం బందరు తరలిపోవడంతో యజమానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మైనింగ్ సిబ్బంది ఖాళీ చేయడానికి ప్రయత్నించారు. దీనిపై యజమాని మైనింగ్ అధికారులను నిలదీశారు. తనకు 14 నెలల నుండి ఎటువంటి అద్దె ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేస్తారని యజమాని హనుమంతురావు ప్రశ్నించారు. పైఅధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేయగా అద్దె బిల్లు వచ్చినప్పుడు ఇస్తామని సమాధానం చెప్పడంతో యజమాని విస్మయం వ్యక్తం చేశారు. అద్దె ఇచ్చిన తరువాతే ఖాళీ చేయాలని ఇంటి యజమాని కార్యాలయానికి తాళం వేశారు.










