ప్రజాశక్తి-హిందూపురం : నాడు ఆర్‌ఎస్‌ఎస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కొమ్ము కాస్తుంటే...నేడు కేంద్రంలో ఉన్నా ఆర్‌ఎస్‌ఎస్ కనుపన్నల్లో ఉన్నా మతతత్వ బిజెపి ప్రభుత్వం అదానీ, అంబానీలకు కొమ్ము కాస్తోందనిసిడబ్యూసి మెంబర్ రఘువీరా రెడ్డి విమర్శించారు. భారత్ జోడో యాత్రకు సంఘీ బావంగా గురువారం సేవామందీర్ నుంచి హిందూపురం వరకు సంఘీ బావ యాత్రను చేపట్టారు. పట్టణంలోని మహాత్మాగాంధీ అంబేద్కర్, నెహ్రు, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ అధ్యక్షత ఇందిరా గాంధి సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతు దేశంలో ప్రజాస్వామ్య పరీరక్షణ కోసం రాహుల్ గాంధీ ఏడాది క్రితం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో ఎన్నికల సమయంలో ఎదో అన్నారని బిజెపి ప్రభుత్వం గుజరాత్‌లో ఆ పార్టీ ఎమ్మేల్యేతో కేసు వేయించి, కోర్టులను సైతం తపుకపదోవ పట్టించి రాహుల్ గాంధీకి శిక్షను వేయడంతో పాటు ఆయన పార్లమెంట్ సభ్వత్వాన్ని సైతం రద్దు చేయించిందని విమర్శించారు. అయితే బిజెపి ఎంపి భారత మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేదిస్తున్నారనిడిల్లీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు. బిజెపి దేశంలో మత విద్వేషాలను రేపుతో ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేటు పరం అవుతాయన్నారు. మణీపూర్‌లో ఉన్నా ఖనీజాలను కాజేయడానికి కూకీలు, మైతీల మధ్య విధ్వేషాలను సృష్టించారనిదీనిపై ప్రదాని నోరు మెదపలేదని అన్నారు. దీన్ని దేశం మొత్తం ఖండిస్తున్నప్పటికి రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేనలు మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఈ పార్టీలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే అన్నారు. దేశం కోసం అన్ని పార్టీలు కలిసి ఇండియాగా కలిసి ముందుకు వస్తున్నాయన్నారు. అయితే రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేనలు మాత్రం ఢిల్లీకి వెళ్లీ గులాములు అవుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బిజెపికి, వీరికి వంతే పాడుతున్న వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. ఈసందర్బంగా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికి రఘువీరారెడ్డి పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోటాసత్యం, బాలాజీ మనోహర్, కెటీ శ్రీధర్, ప్రభాకర్ రెడ్డి, ఇలియాజ్, హరిత, శ్వాం, రఫూఫ్, అమానూల్లా తదితరులు పాల్గొన్నారు.










