Nov 21,2023 00:50
వినియోగదారుల అదాలత్‌ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కొనకనమిట్ల: వినియోగదారుల అదాలత్‌ అవగాహన సదస్సులో 21 సమస్యలను పరిష్కరించినట్లు విశ్రాంత జిల్లా జడ్జి ఎన్‌ విక్టర్‌ ఇమ్మానియేల్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రం కొనకనమిట్ల మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వినియోగదారుల అదాలత్‌ అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత జడ్జి ఎన్‌ విక్టర్‌ ఇమ్మానియేల్‌ మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగదారులకు ఈ సదస్సు ద్వారా అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఇలాంటి సదస్సుల ఏర్పాటు వల్ల అపరిష్కృతంగా ఉన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని అన్నారు. కరెంటు హెచ్చుతగ్గుల బిల్లులను రివిజన్‌ చేసి తగ్గించినట్లు తెలిపారు. బిల్లులు యథావిథిగా చెల్లించాలన్నారు. మునగపాడులో సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు దరఖాస్తులు ఇచ్చారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటు కోసం అప్రూవల్‌కు పంపించామని, 6 నెలల్లో సబ్‌స్ట్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇజివి సత్యనారాయణ, డిఇ ఎస్‌కె కరీం, దర్శి డివిజన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.