Jul 07,2023 16:34
  •  సిఐ బాజీలాల్ 

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : గంజాయి అక్రమ రవాణా చేసిన,విక్రయించిన, వాటికి సహకరించిన వారు ఎంతటివారైనా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్ప వని రాజవొమ్మంగి సీఐ షేక్ బాజీలాల్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ బాజీలాల్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై మండలంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటం జరిగిందని, ఈ నేపథ్యంలో రాజవొమ్మంగి,జడ్డంగి ఎస్ ఐ లు టీజీ నరేంద్ర ప్రసాద్, షరీఫ్ లు ఆధ్వర్యంలో సిబ్బంది రాండం డైనమిక్ వాహన తనిఖీలు ముమ్మరం చేయడం జరిగిందన్నారు. ప్రతి వాహనాలను ఆపి నిశితంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వారు,తరచూ గంజాయి వ్యాపారం చేసేవారు, వారికి సహకరించే వారికి గంజాయి రవాణా తక్షణం మానుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. పోలీస్ హెచ్చరికలు తిరస్కరిస్తే అటువంటి వారిపై పీడియాక్టు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు,వారికి సంవత్సరం వరకు ఎటువంటి బెయిల్ రాదని, ఇప్పటికే కొంతమందిపై పీడియాక్టు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలోని అనేక గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా, ఫేక్ లోన్ యాప్ లు వలన కలిగే అనర్థాలు గూర్చి ప్రజలకు  అవగాహన కలిగించే విధంగా సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు ముమ్మరంగా కురుస్తున్న నేపథ్యంలో వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి వాహనదారుడు రికార్డులు, లైసెన్సు కలిగి ఉండడంతో బాటు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్ళరాదని, తల్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. ఆటోలలో పరిణితిమించి ప్రయాణికులను ఎక్కించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి జడ్డంగి ఎస్ఐ లు టీజీ నరేంద్ర ప్రసాద్, షరీఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.