Apr 09,2023 16:53

ప్రజాశక్తి-యర్రావారిపాలెం(తిరుపతి) : మండల కేంద్రంలో గల కస్తూరిబా గురుకుల పాఠశాల సమీపంలో గల మామిడి తోటలో మామిడి కాయలకు పిచికారి చేసిన మందులు స్ప్రే చేస్తుండగా ప్రమాదవశాత్తు మందుల ట్యాంకర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ట్యాంకురు పైన ఉన్నటువంటి పుట్టకాయల సుబ్రహ్మణ్యం (47) అనే వ్యక్తి పైన ట్యాంకర్ మీద పడటంతో అక్కడికక్కడ మృతి చెందగా రామ్మూర్తి (47) అనే వ్యక్తికి రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి  విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకోని క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టీ గాయపడ్డ వారిని తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించారు.విషయం తెలుసుకున్న సీఐ తులసీరామ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.