ప్రజాశక్తి-తడ(తిరుపతి) : తడ మండలంలోని నేషనల్ హైవే మీద రోడ్డు దాటుతున్న మాధవరం కోదండం (65) తండ్రి పేరు నటేస రెడ్డి అను అతను రోడ్డు దాటుతున్న సమయంలో బోలేరో వాహనం ఢీకొని కోదండం అక్కడిక్కడే మృతి చెందాడు. తడ పోలీసు వారు అందించిన సమాచారం మేరకు పల్లె పాళ్ళలో నివాసం ఉంటున్న కోదండం ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ బాటిల్స్ , చెత్త ఏరుకుని అమ్మగా వచ్చిన దాంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తడ వద్ద నేషనల్ హైవే దాటుతుండగా బోలేరో వాహనం ఢీకొని వెనుకకు పడడంతో తలకు గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసు వారు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు.










