ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని సూరంపాలెం గ్రామ శివారున ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడకి తీవ్ర గాయాలు అయ్యాయి, వివర్లోకి వెలితే, మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన కోటం మోహిత్ అనే యువకుడు రాజవొమ్మంగి నుండి కొండపల్లి బైకుపై వెళ్తుండగా సూరంపాలెం గ్రామ శివారు ప్రాంతంలో మోటర్ బైక్ అదుపు తప్పి రోడ్ పై పడిపోవడంతో యువకుడికి మొహంపై, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి, అటుగా వెలుతున్న వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రమాదానికి గురైన మోహిత్ ని వారి వాహనంలో రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పిహెచ్సీ వైద్యాధికారి శ్రీ దుర్గా ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సహాయ నిమిత్తం 108లో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.










