
అహ్మదాబాద్ : గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. అమ్రేలి ఎస్‌పి నిర్లిప్త్‌రారు కథనం మేరకు... సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో క్రేన్‌ను తరలిస్తుండగా ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లిందని తెలిపారు. గుడిసెలో పదిమంది నిద్రిస్తుండగా... వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిదిమంది మఅతి చెందారని, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను వెంటనే ఆసుప్రతికి తరలించామన్నారు. మరణించినవారిలో ఇద్దరు వఅద్ధులతో పాటు 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.