
ఆచంట:దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు వైట్ల ఉషారాణి, వద్దిపర్తి అంజిబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 9న క్విట్ ఇండియా పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆచంటలోని ప్రజా సంఘాల కార్యాలయం నుంచి కచేరీ సెంటర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే విధానాలు తీసుకొచ్చి ప్రజలపై అనేక భారాలు మోపుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిర్రా నరసింహమూర్తి, తలుపూరి బుల్లబ్బాయి, గుత్తుల శ్రీదేవి, మట్టపర్తి నాగమణి, వరలక్ష్మి, ఝాన్సీ పాల్గొన్నారు.