అచ్చెన్నాయుడుతో బిడ్డిక పద్మావతి
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడును గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆశావహులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి, చేస్తున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజలను వస్తున్న ఆదరణను వివరించారు. గతం కంటే టిడిపికి బలం పెరిగిందని, ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని వివరించారు. 2024 ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. అచ్చెన్నను కలిసిన వారిలో టిడిపి నాయకులు ద్వారపురెడ్డి సత్యనారాయణ, బిడ్డిక పద్మావతి, పువ్వల లావణ్య, ఆర్‌ఎస్‌ఎస్ విజరు కుమార్, బిడ్డిక తమ్మయ్య, భూపతి దొర ఉన్నారు.










