ప్రజాశక్తి - అద్దంకి
పరిశోధనా రత్న, శాసన పరిశోధకులు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళికి ఆచార్య కేసరి విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం ఒంగోలు క్యాంపస్‌లో ఘన సన్మానం చేశారు. రచయిత, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి అచ్చ తెలుగు పదకోశము అనే రచనలు పుస్తకావిష్కరణ ఒంగోలు కేసరి విశ్వ విద్యాలయం, ఆచార్య ఎం అంజిరెడ్డి మరియు వారి అధ్యాపక బృందంతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశ బాషలందు తెలుగు లెస్స అనే నినాదానికి యువత దూరంగా ఉంటున్నారని అన్నారు. తెలుగును మర్చిపోయి ప్రతి తెలుగు పాదాలకు ఇంగ్లీష్ పదాలను చేర్చి, అర్ధాలను మార్చేస్తున్నారని అన్నారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లా రచయితల సంఘం, జిల్లాలోని పలువురు తెలుగు అధ్యాపకులు, రచయిత చంద్రమౌళి గురించి, ఆయన రచనలు గురించి వ్యాఖ్యనించారు. అనంతరం ఆయనను పూలమాలలతో గౌరవించి, శాలువాలతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమం లో డీన్ వెంకటేశ్వరరెడ్డి, రిజిస్టార్ హరిబాబు, రిటైర్డ్ ఆర్‌జెడి యు దేవపాలన, ఎపి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐఖ్య వేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, తెలుగు ఉపాధ్యాయులు జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, బుజ్జి కొమ్మాలపాటి, బండారు చంటిబాబు, అంకం నాగరాజు, అద్దంకి హర్షిణి కాలేజ్ ప్రిన్సిపాల్ నరసింహారావు, గాడేపల్లి దివాకరదత్తు పాల్గొన్నారు.










