ఆచార్య జాన్ సుష్మాకు జీవిత సాఫల్య పురస్కారం
ప్రజాశక్తి-క్యాంపస్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ఆచార్య జాన్ సుష్మాకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. రాంకో అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థ బోధన పరిశోధన, విస్తరణ రంగాల్లో విశేష కషి చేసిన వారికి ఏటా గుర్తించి మహిళలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఇందు లో భాగంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ఆచార్యులు జాన్ సుష్మ ఆ సంస్థ అం దించే జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. చెన్నైలో నిర్వ హించిన అవార్డు ప్రదాన సభలో అవార్డులను స్వీకరించారు. జీవిత సాఫల్య పురస్కారం అవార్డు రావడంపై వర్సిటీ ఉపకులపతి ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజిని, బయోటెక్నాలజీ విభాగాధిపతి, అధ్యాపకులు, పరిశోధకులు, అభినందనలు తెలిపారు.










