Apr 17,2023 01:20
కందుకూరి వీరేశలింగం పంతులుకు నివాళి అర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: సమాజంలో దురాచారాలను రూపుమాపి మహిళా భ్యుదయం కోసం ఉద్యమించిన వారిలో కందుకూరి వీరేశ లింగం పంతులు ప్రముఖులని సాహితీ భారతీయ అధ్యక్షు లు రావూరి నరసింహ వర్మ అన్నారు. ఆదివారం కందుకూరి వీరేశలింగం పంతులు 176వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆధ్వర్యంలో కందుకూరి చిత్రపటానికి పూల మాల వేసిన వాళ్లు అర్పించారు. వర్మ మాట్లాడుతూ మహిళల్లో విద్యాభివృద్ధికి, బాల్య వివాహ నిరోధానికి, వితంతు పునర్వివాహానికి నాటి సమాజం ఎంతగా దూషించిన ద్వేషించిన ఏమాత్రం వెనకడుగు వేయక నిరంతర పోరాటం చేసిన త్యాగధనులు కందుకూరి వీరేశ లింగం అన్నారు. 130 పైచిలుకు రచనలు చేశారన్నారు. కందుకూరి సామాజిక రుగ్మతలు దూరం చేయటానికి బ్రహ్మ సమాజం, హితకారిణి సమాజం వంటి సంస్థలు స్థాపించార న్నారు. తెలుగులో తొలి నవలగా ప్రసిద్ధి చెందిన రాజశేఖర చరిత్రను రచించారు. వివేకవర్ధిని, హాస్య సంజీవిని పత్రికలను కందుకూరి స్థాపించారన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి, ప్రముఖ నటులు మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బానిసలుగా బతుకుతున్న స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని స్వయం సమద్ధిని వీరేశలింగం నెలకొల్పా రన్నారు. తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో సాంఘిక నాటక సమాజాన్ని నెలకొల్పి వ్యవహారిక ధర్మబోధిని, చమత్కార రత్నావళి వంటి నాటకాలు రచించి దర్శకత్వాన్ని వహించి ప్రదర్శించార న్నారు. కార్యక్రమంలో ఆదం షఫి, ఎం జాబ్‌, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.