Sep 08,2023 22:36

గరికపాటి రాజారావుకు నివాళులర్పిస్తున్న ప్రజానాట్యమండలి నాయకులు

సత్తెనపల్లి: ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు 60 వర్ధంతి వేడుకలు సత్తెనపల్లి పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కుటుం బంలో జరిగిన వేడుకలలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పెద్దిరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను అజెండాగా తీసుకొని ఆయన రచించి, దర్శకత్వం వహించిన అనేక నాటకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. ఒకనాడు నాలుగు గోడల మధ్య ఉండే కలలను గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన నాటకాల ద్వారా ప్రజలలోకి బహిర్గతం చేశారని అన్నారు . ప్రజలను చైతన్యవంతం చేసే అనేక నాటకాలకు ఆయన దర్శకత్వం వహించారని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన మా భూమి నాటకం ఎంతో ప్రజాదరణ పొందిందని అన్నారు. అటువంటి అభ్యుదయ ప్రజా కళలను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ముందుగా గరికపాటి రాజారావు చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పొట్టి సూర్య ప్రకాశరావు ,ప్రజా సంఘాల నాయకులు అనుముల వీరబ్రహ్మం, దామర్ల వెంకటేశ్వర్లు, పెండ్యాల మహేష్‌, అనంత వెంకట్‌ నారాయణ, సెగ్గెం వెంకటేశ్వర్లు, పులిపాటి రామారావు పాల్గొన్నారు.