అభివృద్ధిపనులే సమాధానం చెబుతాయి..
షాపింగ్ కాంప్లెక్స్
భూమిపూజ లో మంత్రి రోజా
ప్రజాశక్తి-నగరి : బస్టాండు ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 16 ఏళ్లక్రితం రోడ్ల వెడల్పులో భాగంగా బస్టాండు ప్రాంగణంలోని మునిసిపల్ కాంప్లెక్స్ తొలగించారన్నారు. అప్పటి నుంచి నూతన కాంప్లెక్స్ నిర్మాణం అందని ద్రాక్షగానే మారిందన్నారు. పట్టువదలకుండా చేసిన ప్రయత్నాలతో నేడు కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యమైందన్నారు. 897.67 చదరపు అడుగుల విస్తీర్ణంలో గుడ్‌విల్ బేసిస్‌లో రూ. 2.30 కోట్ల వ్యయంతో డెరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు, ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ తాడేపల్లి వారు ఆమోదించిన నమూనాతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించను న్నామన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 31 గదులు, ఫస్ట్ ఫ్లోర్‌లో 31 గదులు, సెకండ్ ఫ్లోర్‌లో మీటింగ్ హాలు, ఆఫీసులకు 3 గదులు అంటూ మంజూరైన నమూనాలో తొలివిడతగా 31 గదులు నిర్మించనున్నామన్నారు. వీటికి సంబంధిత వేలంపాట ముగిసి నిబంధనల మేరకు షాపులను కూడా కేటాయిం చామన్నారు. ఎన్నికలలోపు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
అభివద్ధిపనులే సమాధానం చెబుతాయి..
నగరిలో అభివద్ధి జరగలేదని చెప్పే వారికి మా అభివద్ధిపనులే సమా ధానం చెబుతాయని మంత్రి ఆర్కేరోజా అన్నారు. రూ. 5.4 కోట్ల వ్యయంతో ఏరియా ఆస్పత్రి నవీకరించడంతో పాటు నగరి, పుత్తూరులో నాలుగు అర్బన్ హెల్త్‌సెంటర్లు నిర్మించామన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నవీకరిం చామన్నారు. పార్కులు, కళ్యాణమండపాలు, షాదీమ హల్‌లు, ఆలయాలు నిర్మిస్తున్నా మన్నారు. గ్రామాల్లో ఆర్బీకేలు, సచివాలయాలు, సమావేశ మందిరాలు, విలేజ్ క్లీనిక్‌లు నిర్మించా మన్నారు. సంక్షేమం ప్రతి ఇంటి తలుపు తడుతోందన్నారు. మనసున్న నాయకుడు కనుకే ఎన్నడూ లేనివిధంగా జగనన్న పాలనలో ఇంతటి అభివద్ధి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు రామ్‌ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్‌లు బాలన్, వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకష్ణ, మున్సిపల్ సచివాలయ కన్వీనర్ దయానిధి, పార్టీ అధ్యక్షులు బీఆర్వీ అయ్యప్పన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.










