Jun 13,2023 20:38

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి -పెద్దకడబూరు
మండలంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వైసిపి మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి టిడిపి నాయకులు తిక్కారెడ్డి, రమాకాంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి పెద్దకడబూరు గ్రామ శివారులోని జగనన్న కాలనీలోని వసతులపై సెల్ఫీలతో ఆరోపణలు చేశారని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తిక్కారెడ్డి కానీ, రమాకాంత్‌ రెడ్డి కానీ మండలంలోని పేదలకు ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. జగనన్న కాలనీలోని ఇళ్ల పట్టాలపై, అక్కడి వసతులపై మాట్లాడే అర్హత లేదని తెలిపారు. వైసిపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో మండల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వివరించారు.