May 17,2023 23:04

నంద్యాలలో చేపట్టిన పాదయాత్రలో నారా లోకేష్‌


అభివృద్ధిని మరిచిన వైసిపి ప్రభుత్వం
- కబ్జాలు చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు
- సండే ఎమ్మెల్యేగా మారిన స్థానిక ఎమ్మెల్యే
- పోరాటగడ్డలో పాదయాత్ర చేయడం నా అదృష్టం
- నంద్యాల బహిరంగ సభలో నారా లోకేష్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      నంద్యాలను అభివృద్ధి చేయకపోగా ఇక్కడ విలువైన భూములను , కబ్జా చేస్తున్నారని, మైనార్టీలు, దళితులను , బహీన వర్గాలను వేదిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ విమర్శించారు. నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్‌ యువ గళం పాదయాత్ర మూలమఠం నుండి నంద్యాల శ్రీనివాస్‌ సెంటర్‌ రాజ్‌ దియోటర్‌ వరకు సాగింది. శ్రీనివాస్‌ సెంటర్‌ బహిరంగ సభలో నారా లోకేష్‌ మాట్లాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి సాయంత్య్ర సమరయోధుల పోరాటగడ్డ, మన తెలుగుబిడ్డ పివి.నరసింహారావును ప్రధానిగా చేయడానికి టిడిపి పోటీచేయకుండా గెలిపించిన ఘనత గలగడ్డ, బుడ్డావెంగళరెడ్డి, భూనాగిరెడ్డి, శోభానాగిరెడ్డి వంటి అభివృద్ధి కాముకులు పుట్టన గడ్డపై పాదయాత్ర చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నంద్యాల జిల్లా ఏర్పడిన తరువాత చాబోలు, అయ్యలూరు, కొండాపురం, సాంబవరం గ్రామాల్లో 3,500 ఎకరాలను ఇండిస్టియల్‌ జోన్‌గా ప్రకటించారని, రైతుల భూములు ఇండిస్టియల్‌ జోన్‌లో ఉండే నంద్యాలో సండే మాత్రమే కనబడే ఎమ్మెల్యే కుటుంబం భూములు మాత్రం గ్రీన్‌జోన్‌లో ఉంటాయన్నారు. అక్కడ మార్కెట్‌ ధర ఎక్కువ ఉంది ఇండిస్టియల్‌ జోన్‌ కారణంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. ఎంపీ బ్రహ్మానందరెడ్డి భూములు, సండే ఎమ్మెల్యే వెంచర్‌ పక్కనే నంద్యాల-జమ్మలమడుగు నేషనల్‌ హైవే రోడ్డు- 167 వెళ్లేలా అలైన్మెంట్‌ అష్ట వంకర్లు తిప్పారన్నారు. రైతులకు నష్టం జరిగేలా మూడు సార్లు అలైన్మెంట్‌ మార్చారని, రైతుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుందన్నానరు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోని రైతులకు న్యాయం చేస్తామన్నారు. నంద్యాల మండలం రాయమలుపురం గ్రామంలో సండే ఎమ్మెల్యే అనుచరుడు శ్రీను శ్మశానాన్ని కబ్జా చేసాడని, నంద్యాల స్టేట్‌ బ్యాంక్‌ కాలనిలో ఒక రిటైర్డ్‌ ఎమ్మార్వోకు చెందిన 22 సెంట్ల భూమిని సండే ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసారని తెలిపారు. ఆంధ్రప్రగతి బ్యాంకులో పనిచేసే మ్యానేజర్‌కు ఎన్‌జిఒ కాలనీలో ఉన్న 20 సెంట్ల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసారన్నారు. నంద్యాల టౌన్‌ బొగ్గులైన్‌లో 40 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు తొలగించి ఎంపీ బ్రహ్మానంద రెడ్డి ఆసుపత్రి కి వెళ్లే రోడ్డు విస్తరించాలని చూస్తున్నారన్నారు. కుందూ నదిని సండే ఎమ్మెల్యే దోచేస్తున్నారని ఒక్కో కిలోమీటర్‌ ఒక్కో అనుచరుడుకి కేటాయించి మట్టి దోచేస్తున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి పైన ఆరోపణలు చేశారు. టిడిపి హయాంలో వేల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని ప్రజలకు ఇవ్వలేని దద్దమ్మ సండే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడని విరుచుకుపడ్డారు. మెడికల్‌ కళాశాలను నంద్యాల ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ఆధారాలతో రుజువుచేస్తే రాజీనామా చేస్తారా అని లోకేష్‌ సవాల్‌ విసిరారు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహాపాపంగా భావిస్తారని, అలాంటిది నంద్యాలలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు, వేధింపుల గురించి తెలుసుకున్న తరువాత నాకు కన్నీరు ఆగలేదన్నారు. ఊసరవెల్లి జగన్‌ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని కేవలం వైసిపి నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడక పోవడం దురదృష్టకరమన్నారు. ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్‌కు కనపడవా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలు సంక్షేమం కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. . మీకు ఇప్పుడు వైసిపిలో కనీస గౌరవం దక్కుతుందా ఒక్క టిడిపిలోనే అందరికి గౌరవం దక్కుతుందన్నారు. పాదయాత్రలో టిడిపి పోలీట్‌ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్‌, జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట్‌ రెడ్డి, నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యేలు బ్రహ్మానందరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, గౌరు చరిత, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తఫా అహ్మద్‌, మైనార్టీ నాయకులు ఎన్‌ఎండి ఫిరోజ్‌, కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.