
* కార్పొరేషన్ కమిషనర్ ఓబులేషు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : నగరాలు, పట్టణాలు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేష్ స్పష్టం చేశారు. వరల్డ్ టౌన్ ప్లానింగ్ డేను పురస్కరించుకొని నగరం లోని డిసిసిబి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్‌లో బుధవారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ శ్రీకాకుళం నగరాన్ని రానున్న 30 ఏళ్లు దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని, ఇప్పటికే మాస్టర్ ప్లాన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని చెప్పారు. డిసెంబరు 4న సదస్సు ఏర్పాటు చేసి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని చక్కని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామ న్నారు. పట్టణ ప్రణాళికా రూపకల్పనలో అన్ని వర్గాల వారి అభిప్రాయాలు తెలుసుకొని భవిష్యత్‌లో ఒక మోడల్ నగరంగా శ్రీకాకుళాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. కాలుష్య రహిత, పర్యావరణ హితాన్ని కోరే నగరంగా శ్రీకాకుళం భవిష్యత్‌లో రూపుదిద్దుకుంటుంద న్నారు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాల యంలో ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.సుగుణాకరరావు, టౌన్‌ప్లానింగ్ విభాగం ఎసిపి ఐ.వి.రమణమూర్తి, టిపిఒ వై.ఉమామహేశ్వరరావు, జిల్లా లైసెన్స్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కె.వి.ఎన్.ఎస్.వి.ప్రసాద్ (హారికాప్రసాద్), ముని శ్రీనివాసరావు, డి.సుధాకరరావు, ఎం.ఎస్.విజ రుకుమార్, నగర పాలన సంస్థ ప్రధాన వైధ్యాధికారి వెంకటరావు, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.