Aug 12,2023 00:05

చిలకలూరిపేట: చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముం దంజలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. స్థానిక మున్సి పల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో నియోజకవర్గ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, జేసీ శ్యాంప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ తదితరులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, అధికారుల కృషితోనే మరింత అభివృద్ధి సాద్యమవుతుందని, ఆ మేరకు అంతా కలిసి పని చేద్దామని అన్నారు. పట్టణ ప్రజలకు అతి త్వరలో అమృత్‌ పథకం ఫలాలు అందజేస్తా మని చెప్పారు. ఎన్‌ ఎస్పీ కెనాల్‌ నుంచి తాగునీటి చెరు వుకు వేస్తున్న పైపులైను పనుల్లో 29 కిలోమీటర్లకు వరకు పెండింగ్‌ ఉందని, ఆ పనులు మినహా మిగిలిన అన్ని పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. 29 కిలోమీటర్ల పైపు లైను పనులను డిసెం బరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్‌ పథకం చిలకలూరిపేట ప్రజల చిరకాల స్వప్నమని, మరో ముఖ్యమైన కార్యక్రమం బైపాస్‌ నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరికల్లా ఈ పనులు పూర్తవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉం దని చెప్పారు. బైపాస్‌ నిర్మాణం పూర్తయితే చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య సమసిపోతుందని, జగనన్న లే అవుట్లలో పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలని, పసుమర్రు లే అవుట్‌కు అప్రోచ్‌ రోడ్డు సమస్యను వెంటనే పరి ష్కరిం చాలని, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పసుమర్రు లే అవుట్‌ను పరిశీలించాలని చెప్పారు. వెంటనే అప్రోచ్‌ రోడ్డుకు పరిష్కారం కనుగొన్నాలన్నారు. పసుమర్రు లే అవుట్‌లో అక్టోబర్‌ 2 నాటికి కనీసం రెండు వేల ఇళ్ల కు సంబంధించి గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని చెప్పారు. నియోజకవర్గంలో నాడు- నేడు కింద ఆస్పత్రులు, పాఠశాలల అభివృద్ధి,జలజీవన్‌ మిషన్‌లో భాగం గా చేపట్టా ల్సిన పనుల గురించి ప్రస్తావించారు.అంగన్‌వాడీ పార Äశాలలు కొత్తగా ఇంకా ఎక్కడ నిర్మించాలనే విషయంతో పాటు నిర్మాణంలో ఉన్న పాఠశాలల వివరాలను అందిం చాలని అన్నారు. బీసీ, కాపు, ఎస్సీ భవన్‌ల శంకుస్థాపన లు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.లిఫ్ట్‌ ఇరిగేషన్ల ఆధునికీకరణకు సంబంధించిన. అంచ నాలను ఉన్న తాధికారులు రూపొందించాలని అన్నారు.