పార్వతీపురంటౌన్: దేశాభివృద్ధికి ఐకమత్యంతో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం అవుదామని స్థానిక ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు అన్నారు. అజాధికా అమృత మహౌత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ''నా నేల - నా దేశం, ''నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం''పంచప్రాణ ప్రతిజ్ఞ, కార్యక్రమంలో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిల్ సభ్యులతో కలిసి దేశం కోసం పోరాడిన త్యాగధనులను, వీరులను గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. మట్టి ప్రమిదలు వెలిగించి ఐకమత్యంతో అభివృద్ధి సాధిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటి ''నా నేల - నా దేశం, ''నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం'' కార్యక్రమం ఈ నెలాఖరు వరకు జరుగుతుందని. వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఆర్మీ జవాన్‌ను సత్కరించారు.కార్యక్రమంలో చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్పర్సన్ గుణేష్, పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ రవికుమార్, కమిషనర్ జె.రామఅప్పల నాయుడు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
భామిని- నా భూమి నా దేశం మండలం లోని బాలేరు, నల్లారాయిగూడ, తలడా, ఘనసర గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర వీరులను స్మరిస్తూ బాలేరు పంచాయతీలో ఏర్పాటు చేసిన అజాదిక అమృత్ స్మారక స్థూపంపై బాలేరు ఎంపిటిసి కొత్తకోట చంద్రశేఖర్, ఎంపిడిఒ చంద్రరావు, ఇఒపిఆర్‌డి కె.కృష్ణారావు, ఎపిఒ తులసీదాస్ పువ్వులు వేసి నివాళులు అర్పించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించేలా కషి చేయాలని డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డి. రామయ్య కోరారు. ఆజాధికా అమృత మహౌత్సవం కార్యక్రమంలో భాగంగా కళాశాలలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్‌లో భాగంగా నా భూమి - నా దేశం కార్యక్రమాన్ని మండలంలోని పాతపనుకువలస, కిరప గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ కల్పనా కుమారి మాట్లాడుతూ నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా దేశభక్తిని పెంపొందించడం, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులను స్మరించుకోవడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో ఒక శిలాఫలకం, 75 మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.సత్యం, ఎపిఒ బాబురావు సాగర్, వైస్ ఎంపిపి కె.సరస్వతి, సర్పంచ్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










