Dec 19,2022 23:08

సచివాలయ భవనం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ముత్తంశెట్టి

ప్రజాశక్తి -ఆనందపురం : గ్రామపంచాయతీల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు సోమవారం వేములవలస పంచాయతీలో వేములవలస సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లీనిక్‌ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనందపురం మండలంలో ఇప్పటి వరకూ రూ.170 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు వేములువలస, బిపి కళ్ళాలలో రూ.23 కోట్లు తో పార్టీలకతీతంగా .అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఏడాదికి రూ.రెండు కోట్ల వరకు ఆదాయం వచ్చిన వేములవలస పంచాయితీ పాలకవర్గం నిధులు సద్వినియోగం చేసుకోకపోవడంపై మండిపడ్డారు.
జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు మాట్లాడుతూ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వేములవలసలో జగనన్న ఇళ్ల పట్టాలు సమస్యను పరిష్కరించాలని కోరారు. జాతీయ రహదారి పనులు సక్రమంగా చేపట్టకపోవడం వల్ల ఆనందపురం కూడలిలో ట్రాఫిక్‌ అస్తవ్యవస్థంగా తయారైందని, ఇక్కడ ట్రాఫిక్‌ సిగల్‌ ఏర్పాటు చేయాలని కోరారు బీపీ.కళ్లాలు సర్పంచ్‌ కోన పైడిరాజు మాట్లాడుతూ, రు వేములవలస మార్కెట్‌ ఆదాయంలో కొంతైనా తమ పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. వైసిపి నేత మణిశంకర్‌, భీమిలి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌, తహశీల్దార్‌ లోకవరపు రామారావు, ఎంపిడిఒో లవ రాజు, ఎంపిపి డాక్టర్‌ మజ్జి శారదా ప్రియాంక, వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను బొట్ట ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బంక సత్యనారాయణ, వ్యవసాయ కమిటీ వైస్‌ చైర్మన్‌ బోని అప్పలనాయుడు, కాకర్లపూడి శ్రీకాంత్ణ్‌రాజు, మజ్జి వెంకట్రావు, జి.శ్రీను, బిఆర్‌బి నాయుడు, కోరాడ అచ్యుత, రాంబాబు సూర్యకుమారి, శ్రీను, కోరాడ ముసలి నాయుడు, కోరాడ అప్పలస్వామినాయుడు, చందక లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం సచివాలయ ఆవరణలోమొక్కలు నాటారు.