Oct 31,2023 20:06

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి - ఆత్మకూర్‌

గ్రామాలాభివృద్ధికి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు కృషి చేయాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం నాడు పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్‌ ఆవరణంలో మండల ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ నల్లకాల తిరుపాలమ్మ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసే గ్రామాల్లో ఏలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి గురించి, ఇంకా చేయాల్సిన పనుల గురించి ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు, పార్టీ మండల ప్రెసిడెంట్‌, సర్పంచులు, కో ఆప్షన్‌ మెంబర్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.