Nov 18,2023 00:14

ప్రజాశక్తి - నగరం
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ చింతల శ్రీ కృష్ణయ్య కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఒ చక్రపాణి ప్రసాద్ వివిధ శాఖల పరిధిలో జరిగిన అభివృద్దిని ఆయా శాఖల అధికారులతో మాట్లాడించారు. అభివృద్ధి, ప్రభుత్వ పథకాల ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు వివరించారు. సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని వివిధ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎంపీపీ ఆదేశించారు. గ్రామాలలోని ప్రజల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో తహాసిల్దారు ఎం ప్రమీల, ఎఒ వి రమేష్ బాబు, సర్పంచ్ తొడివాక అనిల్ కుమార్, ఎంపిటిసి లుక్కా బాపనయ్య, ఎంఇఓ కొలసాని హరిబాబు పాల్గొన్నారు.