ప్రజాశక్తి - అగళి : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రేణుక కామరాజు అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి గురించి ఊసే లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మండల అధికారులు సగం మందికి పైగా హాజరు కాలేదు. ఇక వచ్చిన అధికారులు తమ శాఖకు సంబందించిన డేడాను చదివి వినిపించారు. అందులో అభివృద్ధి పనులపై ఎలాంటి సమాచారం లేదు. ఉన్న దానిలోఉపాధి హామీ పథకం కింద మాత్రమే కొన్ని పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ పనుల్లో కూడా రెండు నెలల నుంచి ఉపాధి కూలీలకు బిల్లులు రాలేదు. ఏది ఏమైనా మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈసమావేశంలో ఎంపిడిఒ నరేంద్ర, తహశీల్దార్ బాషా, జెడ్పీటీసీ ఉమేష్‌తో పాటు పలువురు అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.










