Oct 11,2023 23:24

గుంటూరు: జిల్లాలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాం పులకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై, వైద్యసేవలను విని యోగించుకుంటున్నారని, ఇదే స్పూర్తితో అన్ని ప్రాంతాల్లో క్యాంపులు ముగిసే వరకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌, జెసి జి.రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మతో కలసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సురక్ష క్యాం పులకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. విద్యా శాఖలో గ్రాస్‌ ఎన్‌రోల్‌ఎంట్‌్‌ రేషియో నూరు శాతం ఉండేలా, డ్రాప్‌ ఔట్స్‌ లేకుండా పాఠ శాలల్లో చేర్పించా లన్నారు. గత విద్యా సంవంత్సరంలో పదవ తరగతి ఉత్తీ ర్ణత కాని విద్యార్థులందరి చేత పరీక్ష ఫీజులు కట్టిం చాలన్నారు. జిల్లాలోని ప్రతి క్లస్టర్‌లో జిఇఆర్‌ కు సం బంధించి నూరు శాతం ఎడ్యుకేషన్‌ సర్వే వివరాలు యాప్‌లో అప్లోడ్‌ చేసేలా యంపీడీఓ లు విద్యాశాఖాధి కారులను సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవా లన్నారు. జగనన్నకు చెబుదాం ఆర్జీలను దరఖాస్తు దారు లు సంతృప్తి చెందేలా మెరుగైన పరిష్కారం అందించేలా జిల్లా స్తాయి అధికారులు నిరంతరం పర్య వేక్షించాలన్నారు గ్రామ వార్డు సచివాలయ సేవలు , పంచాయితీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి, రెవిన్యూకు సం బంధించిన అంశాలను మండలాల వారీగా సమీక్షించి సూచనలు అందించారు. కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి, డియం అండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణ బాబు, డిఇఓ శైలజ, పంచాయతీ రాజ్‌ ఎస్‌.ఇ బ్రహ్మయ్య పాల్గొన్నారు.