Aug 28,2023 23:13

ప్రజశక్తి - చీరాల
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ అన్నారు. ఎన్‌ఆర్‌అండ్‌పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో జెసిఎస్ కేడర్‌కు బీమా అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు నియోజకవర్గ పరిశీలకులు మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు. చీరాల నియోజకవర్గంలో 198మంది జేసిఎస్ కన్వీనర్‌లు, సచివాలయాల పరిధిలో 4వేలకు పైగా ఉన్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కన్వీనర్లు, గృహ సారధులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చీరాలలోని వారందరికీ  బీమా సౌకర్యాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కన్వీనర్లు, గృహ సారథలు సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, కొండ్రు బాబ్జీ, ఆర్బికె చైర్మన్లు కావూరి రమణరెడ్డి, పల్లపోలు శ్రీనివాసరావు, దాసరి రామకృష్ణ, దామర్ల శ్రీ కృష్ణ, బుర్ల సాంబశివరావు, కోలా శివ, చీమకుర్తి బాలకృష్ణ, గుంటూరు మాధవరావు, శిఖా సురేష్, ఎరిపిల్లి రమణ, మల్లి రామకృష్ణ, ఆసాది అంకాళరెడ్డి, నాదెండ్ల కోటేశ్వరరావు, బుర్ల మురళి, షేక్ మస్తాన్ పాల్గొన్నారు.