ప్రజాశక్తి గోరంట్ల రూరల్ : అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ తెలిపారు. మండలంలోనిబూచేపల్లి, కొత్తపల్లి, పుట్టగుండ్లపల్లి, గుంతపల్లి గ్రామాలలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, సర్పంచి నర్సిరెడ్డి, ఎంపిటిసి ఓబులరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, రైతు విభాగం అధ్యక్షులు పాటూరి శంకర్ రెడ్డి, గోరంట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ బూదిలి వేణుగోపాల్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ డాక్టర్ భాషా, మండల అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ పోతుల రామకష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : ప్రజా సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమాన్ని వైసిపి ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రొళ్ల మండలం హిట్టే బెట్ట పంచాయతీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.










